చైనాలో వైరల్‌ అవుతోన్న సైనికుడి 'సమాధి' ఫొటో.. గాల్వన్‌లో మృతి చెందిన సైనికుడే!

  • భారత్‌, చైనా మధ్య  గాల్వన్‌ లోయలో జూన్‌లో ఘర్షణ
  • చెన్ చియాంగ్రో అనే చైనా సైనికుడి మృతి
  • అతడి సమాధిపై వివరాలు
  • అంత్యక్రియలను రహస్యంగా నిర్వహించిన చైనా
భారత్‌, చైనా మధ్య గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైనికులు ఎంత మంది మృతి చెందారన్న విషయాన్ని డ్రాగన్ దేశం ఇప్పటికీ బయటపెట్టని విషయం తెలిసిందే. అయితే, గాల్వన్ ఘటనలో ఓ చైనా సైనికుడి మృతికి సంబంధించిన ఓ ఆధారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  చెన్ చియాంగ్రో అనే చైనా సైనికుడి సమాధి అని అందులో ఉంది.

భారత్‌తో గాల్వన్‌లో జరిగిన ఘర్షణలో ఆయన మృతి చెందాడని అందులో పేర్కొన్నారు. మాండరిన్‌ భాషలో 69316 దళాల సైనికుడు, పింగ్నాన్, ఫుజియాన్ నుంచి అని రాసి ఉంది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆ సైనికుడు చేసిన త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందంటూ ఆ సమాధి శిలాఫలకంపై రాసి ఉంది.

చైనా సైనికుల అంత్యక్రియలను ఆ దేశ ప్రభుత్వం రహస్యంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో చైనీయుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోపక్క, జూన్‌లో జరిగిన ఘర్షణలో మృతి చెందిన భారత సైనికులకు దేశంలో సైనిక లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే.


More Telugu News