పీవీకి భారతరత్న ప్రకటించాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తాం!: కేసీఆర్
- తెలంగాణ అస్తిత్వానికి పీవీ ప్రతీక
- దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిన మహానేత
- నెక్లెస్ రోడ్డుకు 'పీవీ జ్ఞానమార్గ్' అనే పేరును పెడుతున్నామన్న సీఎం
తెలంగాణ అస్తిత్వానికి దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రధానిగా అనేక సంస్కరణలను చేపట్టి మన దేశాన్ని అభివృద్ది వైపు నడిపిన మహానేత అని కొనియాడారు. ప్రపంచం గుర్తించిన గొప్ప నాయకుడని అన్నారు.
భారతరత్న పురస్కారానికి పీవీ అన్ని విధాలా అర్హులని చెప్పారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పీవీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని తీర్మానం చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు నెక్లెస్ రోడ్డుకు 'పీవీ జ్ఞానమార్గ్' అనే పేరును పెట్టనున్నట్టు తెలిపారు. హైదరాబాదులో పీవీ మెమోరియల్ నిర్మిస్తామని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఈరోజు కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు.