చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులకు కరోనా పాజిటివ్!

  • సెప్టెంబరు 19న ఐపీఎల్ ప్రారంభం
  • ఈసారి యూఏఈ వేదికగా ఐపీఎల్ పోటీలు
  • చెన్నై జట్టు క్వారంటైన్ మరో వారం పొడిగించే అవకాశం
ఎన్నో ఆశలతో యూఏఈ గడ్డపై అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఎదురుదెబ్బ తగిలింది! సూపర్ కింగ్స్ సభ్యుల్లో పలువురు కరోనా బారినపడ్డారు. ఇవాళ్టి నుంచి శిక్షణ శిబిరం షురూ చేయాలని భావిస్తున్న చెన్నై జట్టుకు ఇది ప్రతిబంధకం కానుంది. కరోనా సోకినవాళ్లలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, జట్టు అధికారులు ఉన్నారని, ఈ జాబితాలో పేసర్ దీపక్ చహర్ కూడా ఉన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. చెన్నై నుంచి దుబాయ్ వెళ్లిన పిమ్మట నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది.

సాధారణంగా, యూఏఈ వెళ్లిన ఐపీఎల్ జట్లకు వారం రోజుల క్వారంటైన్ తప్పనిసరి. అయితే, తమ జట్టు సభ్యుల్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తమ క్వారంటైన్ ను మరో వారం పొడిగించాల్సి వస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఐపీఎల్ తాజా సీజన్ భారత్ నుంచి యూఏఈ తరలివెళ్లడం తెలిసిందే. ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది.


More Telugu News