ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఓ జర్నలిస్టును అపహరించారు: చంద్రబాబు
- జర్నలిస్టు ఇంటికి పోలీసులు వచ్చారన్న చంద్రబాబు
- కుటుంబ సభ్యుల కళ్లెదుటే శివప్రసాద్ ను కిడ్నాప్ చేశారని వెల్లడి
- పత్రికా స్వేచ్ఛ పట్ల బెదిరింపు అంటూ వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు శివప్రసాద్ అనే పాత్రికేయుడ్ని పోలీసులు అపహరించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. హైదరాబాదులోని అతని కుటుంబం కళ్లెదుటే జర్నలిస్టును కిడ్నాప్ చేశారని ట్వీట్ చేశారు. ఓ వ్యక్తి మానవ హక్కులను కాపాడే చట్టాన్ని సైతం అపహాస్యం చేస్తూ శివప్రసాద్ ను ఎత్తుకెళ్లారని విమర్శించారు. ఇది పత్రికా స్వేచ్ఛ పట్ల బెదిరింపు అని, ఈ ఘటనను తాను ఖండిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.