ఏపీ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కు కరోనా పాజిటివ్
- శ్రవణ్ కు కరోనా సోకిన విషయం వెల్లడించిన లోకేశ్
- ఇప్పటికే బుద్ధా వెంకన్నకు పాజిటివ్
- ఇద్దరూ త్వరగా కోలుకోవాలంటూ లోకేశ్ ట్వీట్
దివంగత టీడీపీ నేత కిడారి సర్వేశ్వరరావు తనయుడు, ఏపీ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. కిడారి శ్రవణ్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు. అటు, పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కూడా కరోనా బాధితుల జాబితాలో చేరగా, ఆయన కూడా త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.
గతంలో కిడారి శ్రవణ్ అనూహ్యరీతిలో మంత్రి కావడం తెలిసిందే. ఆయన తండ్రి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోలు హత్యచేయడంతో టీడీపీ అధినాయకత్వం ఆయన తనయుడు కిడారి శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించింది. అయితే, ఆయన పదవిని చేపట్టిన ఆరు నెలల లోపు చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉండగా, ఆ గడువు ముగిసిపోవడంతో కిడారి పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు రాజీనామా చేశారు.