విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు: బీజేపీపై అఖిలేశ్ ఫైర్
- నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న కేంద్రం
- విద్యార్థుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారన్న అఖిలేశ్
- మానవ వనరుల శాఖ పేరును ఎందుకు మార్చారో అర్థమవుతోందని వ్యాఖ్య
కరోనా నేపథ్యంలో ఇంతవరకు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నిన్న కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో, సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. విద్యార్థుల పట్ల బీజేపీ అమానుషంగా ప్రవర్తిస్తోందని ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, 'జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించే విషయంలో బీజేపీ మొండి వైఖరితో ముందుకు సాగుతోంది. మానవ వనరుల శాఖ పేరును బీజేపీ ఎందుకు మార్చిందో ఇప్పుడు అర్థమవుతోంది. విద్యారంగం, విద్యార్థుల పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించాలనుకోవడమే దానికి కారణం' అని విమర్శించారు.