టీటీడీ పాలక మండలి సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకున్న బోర్డు!

  • ఎక్కువ వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బు, బంగారం డిపాజిట్ చేయాలి
  • పాత నోట్ల మార్పిడి కోసం ఆర్బీఐతో చర్చించాలి
  • తిరుమలలో తాగునీటి సరఫరా కోసం రూ. 10 కోట్ల కేటాయింపు
ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై డిపాజిట్ల ద్వారా వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బును జమ చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఎక్కువ శాతం వడ్డీ వచ్చేలా బంగారాన్ని కూడా 5 ఏళ్లకు డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

మరోవైపు స్వామివారికి ఇప్పటికీ పాత నోట్లు వస్తుండటంపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ నోట్లను మార్పిడి చేయడంపై ఆర్బీఐతో చర్చించాలని నిర్ణయించారు. అవసరమైతే  పార్లమెంటులో ఎంపీల ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తించాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

తిరుమల కొండపై తాగునీటి సరఫరా కోసం రూ. 10 కోట్లను కేటాయించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ విధానంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి, అధ్యయనం జరిపించాలని నిర్ణయించారు. మరోవైపు, దీనికి సంబంధించిన యంత్రాల కొనుగోలు కోసం టీటీడీ సభ్యురాలు సుధానారాయణమూర్తి కోటి రూపాయల విరాళం ఇచ్చారు.


More Telugu News