నీట్, జేఈఈ విద్యార్థుల పరిస్థితిని ద్రౌపది వస్త్రహరణంతో పోల్చిన సుబ్రహ్మణ్యస్వామి
- నీట్, జేఈఈ నిర్వహణకు కేంద్రం సిద్ధం
- దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు
- విద్యార్థులకు ఎవరు భరోసా ఇస్తారన్న సుబ్రహ్మణ్యస్వామి
దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్నా గానీ నీట్, జేఈఈ నిర్వహించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉండడం పట్ల బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం నీట్, జేఈఈ విద్యార్థుల పరిస్థితి వస్త్రహరణం ఎదుర్కొంటున్న ద్రౌపదిలా ఉందా? అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణుడి పాత్ర పోషించగలగాలి అన్నారు. తమ రాష్ట్రాల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లి రావడం పట్ల సీఎంలు భరోసా ఇవ్వగలరా? అని నిలదీశారు.
"వాళ్లు అలా చేయలేనట్టయితే, అదే విషయాన్ని ప్రధానికి తేల్చి చెప్పాలి... మేం ఈ పరీక్షలు నిర్వహించలేం అని స్పష్టం చేయాలి" అని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. ఊగిసలాట ధోరణికి ఇది సమయం కాదు అని పేర్కొన్నారు. ఓ విద్యార్థిగా, ఆ తర్వాత ప్రొఫెసర్ గా నా 60 ఏళ్ల అనుభవంతో చెబుతున్నది ఏమిటంటే, ఈ ప్రవేశపరీక్షల నిర్వహణ ఓ తప్పిదం అని వివరించారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యస్వామి తనను తాను విదురుడితో పోల్చుకున్నారు.