జనసేన, బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేసిన వైసీపీ నేతపై కేసు నమోదు చేయండి!: పవన్ కల్యాణ్
- విశాఖపట్నం భీమిలి నియోజక వర్గంలో హత్యాయత్నం
- మూగిప్రసాద్, బీజేపీ కార్యకర్త మూగి శ్రీనివాస్‌లపై దాడి
- వైసీపీ నాయకుడు ఊళ్ల చిన్నా హత్యాయత్నానికి పాల్పడ్డారు
- బాధితులు తీవ్రగాయాలతో కేజీహెచ్‌లో చేరారు
జనసేన, బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేసిన వైసీపీ నాయకుడిని అరెస్టు చేయరా? అని ప్రశ్నిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బాధితుల పక్షాల నిలుస్తోన్న వారిని మాత్రం అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నం భీమిలి నియోజక వర్గంలోని నిడిగట్టు పంచాయతీ నేరెళ్లవలసకు చెందిన జనసేన కార్యకర్త మూగిప్రసాద్, బీజేపీ కార్యకర్త మూగి శ్రీనివాస్‌లపై వైసీపీ నాయకుడు ఊళ్ల చిన్నా హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు.
బాధితులు తీవ్రగాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని పవన్ చెప్పారు. నిందితుడిని అరెస్టు చేయకుండా భీమిలిలో పోలీసులు అనుసరిస్తోన్న విధానం అన్యాయమని ఆయన అన్నారు. వేధింపులకు పాల్పడం, హత్యాయత్నం చేయడం నేరాలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.