సుశాంత్ మృతదేహం వద్ద 'సారీ' చెప్పిన కారణమిదే: రియా
- చనిపోయాక సుశాంత్ ను మూడు సెకన్లే చూశాను
- మరణించిన వ్యక్తికి నేనేం చేయగలను
- గౌరవంగా పాదాలను తాకి, క్షమించమన్నాను
సుశాంత్ మరణించిన తరువాత తాను ఎంతో బాధపడ్డానని, అతని అంత్యక్రియలకు హాజరయ్యే వారి జాబితాలో తన పేరును చేర్చని కారణంగానే వెళ్లలేకపోయానని సుశాంత్ ప్రియురాలు, అతని ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వ్యాఖ్యానించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆమె, సుశాంత్ ను కడసారి చూసేందుకు మార్చురీ వద్దకు వెళ్లానని, అక్కడ కూడా చాలా సేపు నన్ను లోనికి అనుమతించలేదని, డెడ్ బాడీని వ్యాన్ ఎక్కిస్తుంటే కేవలం మూడు నాలుగు సెకన్లు మాత్రమే చూశానని చెప్పారు.
ఆ సమయంలో 'సారీ బాబూ' అని రియా వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, జీవితాన్ని కోల్పోయి, మరణించిన ఓ వ్యక్తిని క్షమించమని కోరడం మినహా తాను ఇంకేం చేయగలనని ప్రశ్నించారు. గౌరవంతో అతని పాదాలను తాకానని, భారతీయుడు ఎవరైనా దీన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. సుశాంత్ కుటుంబీకులకు తానంటే ఇష్టం లేదని చెప్పారు.