కీటక నాశక పదార్థంతో కరోనా వైరస్ హతం: బ్రిటన్ శాస్త్రవేత్తలు
- కీటకనాశిని మోసీగార్డ్ వంటి ఉత్పత్తుల్లో ‘సిట్రియోడియోల్’
- రెండు ప్రయోగాల్లోనూ సానుకూల ఫలితాలు
- మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్న శాస్త్రవేత్తలు
ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతుండగా, తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో కొత్త అధ్యయన వివరాలను వెల్లడించారు. కీటక నాశకాల (రిపెల్లెంట్స్)లోని ఓ పదార్థంతో కరోనా వైరస్‌ను హతమార్చవచ్చని డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ (డీఎస్‌టీఎల్) శాస్త్రవేత్తలు తెలిపారు.
కీటకాలను తరిమికొట్టేందుకు ఉపయోగించే మోసీగార్డ్ వంటి ఉత్పత్తుల్లో యూకలిప్టస్ సిట్రియోడోరా అనే చెట్టు ఆకులు, కొమ్మలతో తయారయ్యే సిట్రియోడియోల్ అనే పదార్థం ఉంటుంది. దీనిని మరో పదార్థంతో కలిపి ఉపయోగించినప్పుడు కరోనా వైరస్‌లో ఒకరకమైన ‘సార్స్ కోవ్2’ ఇంగ్లండ్ 2’ను నాశనం చేసినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. లేటెక్స్‌తో తయారైన కృత్రిమ చర్మంపై జరిపిన మరో పరిశోధనలోనూ ఇలాంటి ఫలితమే వచ్చినట్టు వివరించారు. కరోనాపై పోరులో భవిష్యత్తులో ఇది కీలకం కాగలదని అయితే, అంతకంటే ముందు మరిన్ని ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.