రూ. 370కి కొవిడ్ ఉందో లేదో చెప్పే టెస్టింగ్ కార్డు... అనుమతించిన అమెరికా ఎఫ్డీఏ!
- క్రెడిట్ కార్డులా కనిపించే కారు
- 15 నిమిషాల్లోనే ఫలితం
- అబాట్ నుంచి 'బైనాక్స్ నౌ కొవిడ్-19 ఏజీ కార్డ్'
ఎక్కడైనా, ఎప్పుడైనా సులువుగా కరోనా టెస్టింగ్ స్వయంగా చేసుకోగల అతి చౌకైన పరికరాన్ని యూఎస్ ఎఫ్డీయే (ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతించింది. ఇది క్రెడిట్ కార్డులా కనిపిస్తుంది. దీని పేరు 'అబాట్ బైనాక్స్ నౌ కొవిడ్-19 ఏజీ కార్డ్'. అత్యవసర వాడకం ప్రాతిపదికన ఈ కార్డు వినియోగానికి అనుమతిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. దీని ధర 5 డాలర్లు (సుమారు రూ. 370) మాత్రమే కావడం విశేషం. హాస్పిటల్స్, స్కూల్స్, ఆఫీసులు, ఫ్యాక్టరీలు... ఇలా ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు.
ముక్కు నుంచి జాగ్రత్తగా స్రవాలను సేకరించి, ఈ కార్డు ద్వారా టెస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. 15 నిమిషాల్లోనే ఫలితం తెలిసిపోతుంది. దీని ఫలితాన్ని అబాట్ కంపెనీ విడుదల చేయనున్న ఎన్వీఐసీఏ మొబైల్ యాప్ లో ఉచితంగా చెక్ చేసుకోవచ్చు. నెగటివ్ వచ్చిన వారికి వెంటనే డిజిటల్ పాస్ కూడా జారీ అవుతుంది. ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం మరింత కచ్చితత్వం కోసం ల్యాబ్ టెస్టులను సిఫార్సు చేస్తున్నట్టు అబాట్ పేర్కొంది. బైనాక్స్ నౌ ఆవిష్కరణతో కంప్యూటర్లు, టెక్నికల్ పరికరాలు లేకుండా కరోనా పరీక్ష చేసుకునే సౌలభ్యం దగ్గరైందని అబాట్ పేర్కొంది.