తెలంగాణలో కొత్తగా 2,932 కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,415
- ఆసుపత్రుల్లో 28,941 మందికి చికిత్స
- 87,675 మంది డిశ్చార్జ్
- మృతుల సంఖ్య మొత్తం 799
తెలంగాణలో కొవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,863 కరోనా పరీక్షలు చేయగా 2,932 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1580 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,415 కి చేరింది. ఆసుపత్రుల్లో 28,941 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 87,675 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 799కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 520 కరోనా కేసులు నమోదయ్యాయి.