నేను కలలో కూడా ఊహించని వీడియో ఇది: ఆనంద్ మహీంద్రా

  • బైక్ చక్రంతో మొక్కజొన్న గింజల ఒలిచివేత
  • ఇలాంటి సృజనాత్మకతను తాను చూడలేదన్న మహీంద్రా
  • ట్విట్టర్ ఖాతాలో వీడియో
తన దృష్టికి వచ్చిన ఆసక్తికరమైన విషయాలను వెంటనే పంచుకునే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో వినూత్న వీడియోను పోస్ట్ చేశారు. స్టాండ్ వేసివున్న బైక్ ను స్టార్ట్ చేసి గేర్ లో ఉంచి, వెనుక చక్రాన్ని తిప్పుతూ, మొక్కజొన్న పొత్తులను దానికి ఆనించి పట్టుకోగా, విత్తనాలన్నీ చాలా సులభంగా విడిపోతూ కింద పడుతున్నాయి. ఈ చక్రం తిరిగే వేగానికి పది సెకన్లలోపే ఓ కండె నుంచి విత్తనాలను వేరు చేస్తున్నారు. చక్రానికి ఇరువైపులా ఇద్దరు కూర్చుని టకటకా పనిచేస్తున్నారు.

ఇక ఈ వీడియో ఆనంద్ మహీంద్రా వద్దకు చేరగా, ఇటువంటి సృజనాత్మకతను తాను కలలోనైనా చూడలేదన్నారు. "మన వ్యవసాయ విధానంలో బైకులు, ట్రాక్టర్లను వాడుతూ ఎన్నో రకాల పనులను రైతులు సులువుగా చేసుకుంటున్న వీడియోలు నాకెన్నో వస్తుంటాయి. ఈ వీడియో నేను కలలో కూడా ఊహించనిది. ఇకపై ''కార్న్ టినెంనల్" అనే ప్రత్యేక బ్రాండ్ ను ప్రారంభించాల్సిన సమయం వచ్చిందేమో" అని వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసిస వీడియోను మీరూ చూడవచ్చు.


More Telugu News