రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న మైసూరు యువరాజు!
- నేను రాజకీయాల్లోకి రావాలా? అంటూ ట్వీట్
- వస్తే విమర్శలు తప్పవన్న కొందరు
- మీలాంటి వారు రావాల్సిందేనన్న మరికొందరు
మైసూరు యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ‘‘నేను రాజకీయాల్లో చేరాలా?’’ అంటూ అభిమానులను అడుగుతూ చేసిన ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. ఆయన ప్రశ్నకు నెటిజన్ల నుంచి పరస్పర విరుద్ధ సమాధానాలు వచ్చాయి. కొందరు వద్దే వద్దని చెప్పగా, మరికొందరు మాత్రం రావాల్సిందేనని కోరారు. రాజకీయాల్లోకి వస్తే తప్పులు జరిగినప్పుడు మిమ్మల్ని విమర్శించకతప్పదని, కాబట్టి తొందరపడి అటువంటి నిర్ణయం తీసుకోవద్దని కొందరంటే, మీలాంటి మంచి వారు రాజకీయాల్లోకి రావాల్సిందేనని, అవినీతి నిర్మూలనకు మీలాంటి వారి అవసరం ఎంతో ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు.