విజయసాయిరెడ్డీ, ఇళ్ల స్థలాలు ఎందుకు వాయిదా వేస్తున్నావు గన్నేరు పప్పు? అని నీ అల్లుడ్ని అడుగు: అయ్యన్నపాత్రుడు

  • పలుమార్లు వాయిదాపడిన ఇళ్ల స్థలాల పంపిణీ
  • సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారన్న అయ్యన్న
  • రోడ్లమీదికి తరిమికొడతారంటూ వ్యాఖ్యలు
ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పదేపదే వాయిదా పడుతుండడం పట్ల టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'విజయసాయిరెడ్డీ, ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎందుకు వాయిదా వేస్తున్నావు గన్నేరు పప్పు? అని  నీ అల్లుడ్ని అడుగు' అంటూ ట్విట్టర్ లో స్పందించారు. ఇళ్ల స్థలాల పంపిణీ నాలుగుసార్లు వాయిదా వేసి సిగ్గులేని ఆరోపణలా అంటూ మండిపడ్డారు.

 పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రూ.10 లక్షల విలువలేని భూములను రూ.50 లక్షలకు కొని అడ్డంగా బొక్కారని ఆరోపించారు. పేదల పేరుతో మీరు చేసిన రూ.5 వేల కోట్ల స్కామ్ తప్పకుండా బయటికి వస్తుందని, పేదలు నిన్నూ, మీ గన్నేరు పప్పును రోడ్లమీద తరిమికొట్టడం ఖాయం అంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


More Telugu News