కరోనా రోగులకి ఆసుపత్రిలో బెడ్ లు దొరకడంలేదు, ఆక్సిజన్ అందడంలేదు: దేవినేని ఉమ

  • ఏపీలో దేశంలోనే అత్యధిక కేసులు అంటూ ట్వీట్
  • నేతల సిఫారసుతో వచ్చిన వారికి బెడ్ లు అంటూ ఆరోపణ
  • ఆక్సిజన్ సరఫరాలో మాఫియా తయారైందని వ్యాఖ్యలు
ఏపీలో కరోనా పరిస్థితులపై మీడియాలో కథనాలు రావడం పట్ల మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ స్పందించారు. నిన్న ఒక్కరోజే 10,830 కేసులు వచ్చాయని, 81 మరణాలు సంభవించాయని... కేసుల విషయంలో దేశంలోనే అత్యధికమని ఉమ విమర్శించారు.

 ఆసుపత్రిలో బెడ్ లు దొరకడంలేదు, ఆక్సిజన్ అందడంలేదంటూ ట్వీట్ చేశారు. నేతల సిఫారసుతో వచ్చినవారికి, ఎక్కువ రేటు చెల్లిస్తున్న వారికి బెడ్ లు కేటాయిస్తున్న పరిస్థితుల నెలకొంటున్నాయి అని తెలిపారు. రాష్ట్రంలో ఆసుపత్రులను కాదని పొరుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ తరలిపోతోందని, ఆక్సిజన్ సరఫరాలో మాఫియా రాజ్యం తయారైందని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు కరోనా కట్టడికి చర్యలేమైనా తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు.


More Telugu News