చైనాలో కూడా మోదీ ప్రభంజనం.. చైనా అధికార పత్రిక సర్వేలో తేలిన వాస్తవాలు!

  • మోదీ నాయకత్వం భేష్ అంటున్న 50 శాతం మంది చైనీయులు
  • చైనా వ్యతిరేక భావనలు ఇండియాలో ఎక్కువన్న 70 శాతం మంది 
  • ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు తొలగిపోతాయని భావిస్తున్న 30 శాతం మంది చైనీయులు
ఇండియాలోనే కాదు చైనాలో సైతం మోదీ గాలి వీస్తోంది. ఈ సంచలన విషయాన్ని సాక్షాత్తు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెలువరించింది. మోదీని అభిమానించే చైనీయుల సంఖ్య ఎక్కువ సంఖ్యలోనే ఉందని ఆ పత్రిక పేర్కొంది. లడఖ్ ఘర్షణ జరిగిన మూడు నెలల తర్వాత దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలిందని వెల్లడించింది. చైనాలో ఉండే నేతల కేంటే మోదీకే ఈ దేశంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉందని తెలిపింది.

చైనాలో 50 శాతం మంది ప్రజలు స్థానిక పాలకుల పట్ల అనుకూలంగా ఉన్నారని... ఇదే సమయంలో మరో 50 శాతం మంది మోదీ విధానాలను, నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారని పేర్కొంది. ఇదే సమయంలో చైనీయుల మనసులోని భావనను కూడా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. భారత్ లో చైనా వ్యతిరేక భావనలు ఎక్కువగా వున్నాయని 70 శాతం మంది చైనీయులు పేర్కొన్నట్టు తెలిపింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోతాయని 30 శాతం మంది చైనీయులు అభిప్రాయపడ్డట్టు వెల్లడించింది.


More Telugu News