టీఆర్‌పీ రేటింగ్స్‌లో బాహుబలి రికార్డులు బద్దలుకొట్టిన 'అల వైకుంఠపురములో' సినిమా

టీఆర్‌పీ రేటింగ్స్‌లో బాహుబలి రికార్డులు బద్దలుకొట్టిన 'అల వైకుంఠపురములో' సినిమా
  • ఇటీవల జెమినీ టీవీలో ప్రసారం
  • ఏ తెలుగు సినిమాకు రాని విధంగా 29.4 రేటింగ్స్‌
  • థియేటర్లో విడుదలై 7 నెలలు
  • ఓటీటీలో విడుదలై 6 నెలలు  
టాలీవుడ్‌లో బాహుబలి తర్వాత అంతటి బిగ్గెస్ట్ హిట్‌ను సాధించిన అల్లు అర్జున్ 'అల వైకుంఠ పురములో' సినిమా టీఆర్‌పీ రేటింగ్స్‌లో బాహుబలిని వెనక్కి నెట్టేసింది. తాజాగా, 'అల వైకుంఠ పురములో' సినిమా జెమినీ టీవీలో ప్రసారమైంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని విధంగా 29.4 రేటింగ్స్‌ను సాధించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, టబూ కీలక పాత్రల్లో నటించారు.

'ఈ సినిమా థియేటర్లో విడుదలై 7 నెలలు అవుతోంది. ఓటీటీలో విడుదలై 6 నెలలు అవుతోంది. అయినప్పటికీ టీవీలో 29.4 రేటింగ్స్‌ సాధించి, ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా సాధించని రేటింగ్స్‌ను రాబట్టింది. ఇంత ప్రేమ కురిపిస్తోన్న అభిమానులకు కృతజ్ఞతలు' అని గీతా ఆర్ట్స్‌తో పాటు హారిక, హాసిని క్రియేషన్‌ తమ ట్విట్టర్ ఖాతాల్లో పేర్కొన్నాయి.


More Telugu News