ఎస్ఐ దగ్గర ఐస్ క్రీమ్ కు డబ్బులు ఎక్కువ తీసుకున్న రెస్టారెంట్... ఆపై బుక్కయిన వైనం!

  • ముంబైలో 2014లో ఘటన
  • రూ.10 అదనంగా తీసుకున్న రెస్టారెంట్
  • 2.45 లక్షల జరిమానా విధించిన కోర్టు
అతని పేరు జాదవ్. ముంబైలో పనిచేస్తున్న ఓ సబ్ ఇనస్పెక్టర్. రెస్టారెంట్ కు వెళ్లి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. దానికి రెస్టారెంట్ రూ.175 వసూలు చేసింది. ఆపై ఎక్స్ పైరీ తేదీ కోసం చూస్తుండగా, ఎంఆర్పీ రూ. 165 అని కనిపించింది. ఇదేంటని అడుగుతూ, రూ. 10 వెనక్కు ఇవ్వాలని జాదవ్ కోరగా, అది కూలింగ్ చార్జ్ అంటూ, రెస్టారెంట్ నిర్వాహకులు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చి, అడ్డంగా బుక్కయిపోయారు.

ఈ ఘటన 2014 జూన్ లో షగుణ్ వెజ్ రెస్టారెంట్ లో జరిగింది. ఆపై జాదవ్, తన నుంచి అదనంగా డబ్బు తీసుకున్న రెస్టారెంట్ పై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దాదాపు ఐదున్నరేళ్లకు పైగా సాగగా, ఇంతకాలానికి న్యాయం పొందారు. రెస్టారెంట్ అదనంగా డబ్బులు వసూలు చేయడం తప్పేనంటూ రూ. 2.45 లక్షల జరిమానాను న్యాయస్థానం విధించింది.


More Telugu News