"బాలూ... రావా ఇక చాలూ..." కన్నీరు పెట్టించేలా బాలిక వీడియో!
- 'సాగరసంగమం' చిత్రంలో 'వేదం అణువణువున నాదం' పాట
- ఆ పాట సాహిత్యాన్ని మార్చిన అద్దంకి వనీజ
- వైరల్ అవుతున్న వీడియో
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సాగర సంగమం' సినిమా చూడని వారుండరు. ఆ సినిమా క్లయిమాక్స్ లో వచ్చే "వేదం... అణువణువున నాదం... నా పంచ ప్రాణాల నాట్య వినోదం.." అంటూ సాగే పాటను చూసి కన్నీరు పెట్టుకోని వారు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ పాట పాడినది ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం కరోనా సోకి, తీవ్ర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకోవాలని ఓ బాల అభిమాని సొంతంగా పాట సాహిత్యాన్ని మార్చి పాడగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.
బాలూ కోలుకోవాలంటూ "వేదం... అణువణువున నాదం... నా పంచ ప్రాణాల.." అంటూ సాగే పాటను "బాలూ... రావాలిక చాలూ..." అంటూ ఆ పాప పాడిన పాట విన్నవారి కళ్లు చెమర్చేలా చేస్తోంది. తమ అభిమాన గాయకుడు మళ్లీ తిరిగి వచ్చి పాటలు పాడి, ఆనందింపజేయాలని కోరుకునేలా చేస్తోంది. అద్దంకి వనీజ అనే ఈ బాలిక పాడిన పాటను మీరూ చూడండి.