కిమ్‌కు ఏమీ కాలేదు.. కావాలంటే చూడండి: ఫొటో విడుదల చేసిన ఉత్తర కొరియా
- ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేసిన ఉత్తర కొరియా
- ఓ సమీక్షలో పాల్గొన్న కిమ్
- పొగతాగుతూ కనిపించిన నియంత
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లిపోయారని, చనిపోయారని వస్తున్న వార్తలపై ఆ దేశం స్పందించింది. గతంలోలానే ఆయన సమావేశంలో పాల్గొనట్టు ఉన్న ఫొటోను విడుదల చేసి ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేసింది.
నిన్న జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొన్న కిమ్ సమీక్ష జరుపుతున్నట్టు ఉన్న ఆ ఫొటోలో ఆయన పొగతాగుతూ కనిపించినట్టు ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ పేర్కొంది. ఈ సమావేశంలో కిమ్ అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ఉన్న లోటుపాట్లపై అధికారులతో చర్చించినట్టు తెలిపింది.
కిమ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని, ఆయన మృతి చెంది ఉండవచ్చని గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే, వీటికి తెరదించుతూ ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కిమ్ పాల్గొన్నట్టు ఉన్న వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా, మరోమారు అలాంటి వార్తలే హల్‌చల్ చేస్తుండడంతో ఈసారి ఫొటోను విడుదల చేసింది.