కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని.. రాజీనామా చేసిన శివసేన ఎంపీ

  • పర్భానీ ఎంపీ సంజయ్ జాదవ్ రాజీనామా
  • రాజీనామాను ఆమోదించాలంటూ సీఎంకు లేఖ
  • ఎన్సీపీ నేతకు జింటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పగ్గాలు అప్పగించడంపై కినుక
శివసేనకు చెందిన పర్భానీ ఎంపీ సంజయ్ జాదవ్ తన పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు పంపించారు. సొంత నియోజకవర్గం నుంచి పార్టీ తనను దూరంగా పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఈ కారణంగా తాను పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోతున్నానని, వారికి న్యాయం చేయలేనప్పుడు ఎంపీగా కొనసాగడంలో అర్థం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇక ఎంపీగా కొనసాగే అర్హత తనకు ఎంతమాత్రమూ లేదని, కాబట్టి తన రాజీనామా ఆమోదించాలని లేఖలో కోరారు.

అయితే, ఆయన రాజీనామా వెనక మరో కారణం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పర్భానీ జిల్లాలోని జింటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అడ్మినిస్ట్రేటర్ నియామకం విషయంలో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారని, శివసేన కార్యకర్తలను అవమానించిన ఎన్సీపీ నేతకు మార్కెట్ పగ్గాలు అప్పగించడంతో కినుక వహించిన ఎంపీ జాదవ్ తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.


More Telugu News