ఐక్యరాజ్యసమితిలో చైనాకు చేదు అనుభవం!

  • ఉయ్ ఘర్లు, ఇతర మైనార్టీలను చైనా నిర్బంధిస్తోందన్న యూఎస్, బ్రిటన్, జర్మనీ
  • 10 లక్షల మందికి పైగా ప్రజలను నిర్బంధించిందని వాదన
  • భద్రతామండలిలో ఏకాకిగా మిగిలిపోయిన చైనా
ఐక్యరాజ్యసమితిలో అత్యంత కీలక విభాగమైన భద్రతామండలిలో చైనాకు ఊహించని పరాభవం ఎదురైంది. చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఉయ్ ఘర్ ముస్లిం మైనార్టీలపై ఆ దేశం ఎంతో కాలంగా అణచివేతకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ఈరోజు భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు లేవనెత్తాయి. రాజకీయ అసంతృప్తిని అణచివేస్తున్నామనే సాకును చూపుతూ... కౌంటర్ టెర్రరిజానికి చైనా పాల్పడుతోందని ఈ దేశాలు విమర్శించాయి. ఇలాంటి పనులు మానుకోవాలని చైనాకు హితవు పలికాయి.

దాదాపు 10 లక్షల మందికి పైగా ఉయ్ ఘర్లను, ఇతర మైనార్టీలను చైనా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా శాశ్వత ప్రతినిధి కెల్లీ క్రాఫ్ట్ అన్నారు. ఆయన వాదనతో బ్రిటన్, జర్మనీలు ఏకీభవించాయి. ఈ నేపథ్యంలో భత్రతామండలిలో చైనా ఏకాకిగా మిగిలిపోయింది.


More Telugu News