ఇప్పుడు మనందరి లక్ష్యం ఒక్కటే: బాలకృష్ణ
- కరోనాను కలసికట్టుగా ఎదుర్కోవడమే మన లక్ష్యం
- ప్రజలంతా మరింత బాధ్యతతో వ్యవహరించాలి
- త్వరలోనే వ్యాక్సిన్ రావాలని భగవంతుడిని కోరుకుంటున్నా
ప్రస్తుత సమయంలో కరోనాను ఎదుర్కోవడమే మనందరి లక్ష్యమని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వాలు బాధ్యతగా పని చేయాలని... ప్రజలు అంతకన్నా ఎక్కువ బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. అందరూ కలసి సంయుక్తంగా కరోనాను జయించాలని అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ కు ఈరోజు సంగారెడ్డిలోని మహేశ్వర మెడికల్ కాలేజి వారు పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని... త్వరలోనే వ్యాక్సిన్ రావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఇప్పటికే పలు చోట్ల ప్లాస్మా బ్యాంకులను ఏర్పాటు చేశారని... ప్లాస్మాతో అనేక మంది ప్రాణాలను వైద్యులు కాపాడుతున్నారని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
.