ఏపీ సెక్రటేరియట్ పై మరోసారి కరోనా పంజా

  • కొత్తగా 14 మంది ఉద్యోగులకు కరోనా
  • కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా టెస్ట్ చేయించుకోవాలన్న అధికారులు
  • ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు
ఏపీ సచివాలయాన్ని ఇప్పటికే బెంబేలెత్తించిన కరోనా వైరస్... మరోసారి పంజా విసిరింది. తాజాగా 14 మంది ఉద్యోగులు మహమ్మారి బారిన పడ్డారు. దీంతో అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా టెస్టులు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. మరోవైపు సచివాలయాన్ని శానిటైజ్ చేశారు. ఇంకోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు దాదాపు 10 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి.


More Telugu News