మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
- ప్రబణ్ ముఖర్జీ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స
- కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు మరింత క్షీణించిన వైనం
- ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారన్న ఆర్మీ ఆసుపత్రి
కరోనాతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న మాజీ రాష్ట్రపతి ప్రబణ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన ఊపిరితిత్తులకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకిన విషయం తెలిసిందే. ఆయనకు కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి తాజాగా బులెటిన్ విడుదల చేసింది.
ప్రబణ్ ముఖర్జీ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స అందుతోందని, నిన్నటి నుంచి, కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు బాగాలేదని తెలిపింది. ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై ఉంచే చికిత్స అందిస్తున్నామని పేర్కొంది.