గులాం నబీ అజాద్ ను సముదాయించిన సోనియాగాంధీ?

  • సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు
  • రాహుల్ వ్యాఖ్యలకు నొచ్చుకున్న అజాద్
  • అజాద్ కు ఫోన్ చేసిన సోనియాగాంధీ
సీడబ్ల్యూసీ సమావేశంలో కొందరు సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన గులాం నబీ అజాద్ తీవ్రంగా నొచ్చుకున్నారు. పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఈ నేపథ్యంలో అజాద్ ను శాంతింపజేసే పనుల్లో హైకమాండ్ నిమగ్నమైంది. అజాద్ కు సాక్షాత్తు సోనియాగాంధీనే ఫోన్ చేసినట్టు సమాచారం. రాహుల్ వ్యాఖ్యలకు నొచ్చుకోవద్దని ఈ సందర్భంగా సోనియా కోరినట్టు తెలుస్తోంది. అసమ్మతివాదుల డిమాండ్లను వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు సమాచారం.


More Telugu News