ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయిన విజయసాయిరెడ్డి
- ఉపరాష్ట్రపతి భవన్ లో భేటీ
- స్టాండింగ్ కమిటీ రిపోర్టును అందించిన విజయసాయి
- వ్యవసాయ, సముద్రపు ఉత్పత్తులపై రిపోర్ట్
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కలిశారు. ఉపరాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ఆయన... వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టును వెంకయ్యకు అందజేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులు, సముద్రపు ఉత్పత్తుల ఎగుమతులు, పంటలు, పసుపు, కొబ్బరి పీచు వంటి వాటికి సంబంధించిన రిపోర్టును గౌరవనీయులైన రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతికి అందించడం జరిగిందని ట్విట్టర్ లో ఆయన పేర్కొన్నారు.