'స్పుత్నిక్ 5' వ్యాక్సిన్ వివరాలు కోరిన ఇండియా... వెంటనే సమాచారం పంపిన రష్యా!
- రష్యా నుంచి ప్రాథమిక సమాచారం అందింది
- వెల్లడించిన ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్
- ప్రస్తుతం 40 వేల మందికి రష్యాలో వ్యాక్సిన్
రెండు వారాల క్రితం రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-5 గురించిన సమాచారం తమకు అందిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. తాము వ్యాక్సిన్ ను తయారు చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై భారత్ సహా 20 దేశాలు ఈ వ్యాక్సిన్ ను కోరుతున్నాయని రష్యా స్వయంగా ప్రకటించింది కూడా. తాజాగా మీడియాతో మాట్లాడిన రాజేష్ భూషణ్, "స్పుత్నిక్ 5కు సంబంధించినంత వరకూ ఇండియా, రష్యాలు సమాచార మార్పిడి చేసుకున్నాయి. రష్యా నుంచి ప్రాథమిక సమాచారం అందింది" అని అన్నారు.
కాగా, వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ఫలితాలు వెల్లడి కాకుండానే రిజిస్టర్ చేస్తూ, తామే ప్రపంచంలో తొలిసారి కరోనాకు వ్యాక్సిన్ ను తయారు చేశామని రష్యా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ను దేశంలోని 45 మెడికల్ సెంటర్లలో 40 వేల మంది ప్రజలపై పరిశీలిస్తున్నామని న్యూస్ ఏజన్సీ 'టాస్' వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు ఇండియాతో డీల్ కుదుర్చుకోవాలని కూడా రష్యా ఇప్పటికే నిర్ణయించింది. ఈ విషయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ దిమిత్రేవ్ స్వయంగా వెల్లడించారు కూడా.
రష్యా వ్యాక్సిన్ తయారీ విధానం, దాని పనితీరుపై సమాచారం ఇవ్వాలని భారత ఆరోగ్య శాఖ కోరగా, అందుకు అంగీకరించిన రష్యా, తాము దీన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని వివరిస్తూ, ఇనీషియల్ సమాచారాన్ని పంపించిందని రాజేష్ భూషణ్ తెలియజేశారు. దీన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని, అక్కడ జరుగుతున్న ఆఖరి దశ ట్రయల్స్ ఫలితాలను పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.