20 మిలియన్ డాలర్ల లంచం ప్రపంచంలో ఇదే ప్రథమం... కీసర తహసీల్దారుపై స్పందించిన గిన్నిస్ బుక్!
- రూ.1.10 కోట్లు లంచం తీసుకున్న నాగరాజు
- గిన్నిస్ రికార్డు అధికారులను సంప్రదించిన స్వచ్చంద సంస్థలు
- పరిశీలిస్తామని సమాధానం ఇచ్చిన గిన్నిస్
తెలంగాణలో సంచలనం రేపిన కీసర తహసీల్దారు బాలరాజు నాగరాజు, అవినీతిలో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేలా ఉన్నారు. ఓ భూమికి పట్టా ఇచ్చే విషయంలో రూ. 2 కోట్లకు డీల్ కుదుర్చుకుని, ఏకంగా రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం విదితమే.
ఓ ప్రభుత్వ ఉద్యోగి, దాదాపు 20 మిలియన్ డాలర్లు లంచం స్వీకరిస్తూ, పట్టుబడటం ఇదే తొలిసారని, ఆయన పేరును రికార్డుల్లోకి ఎక్కించాలని కోరుతూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండుస్వచ్చంద సంస్థలు గిన్నిస్ రికార్డు అధికారులను కోరగా, దాని ప్రతినిధులు స్పందించారు. ఇప్పటివరకూ ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన కేటగిరీ లేదని, దీనికోసం ఓ కొత్త కేటగిరీని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని గిన్నిస్ ప్రతినిధులు తెలియజేశారని జ్వాల సంస్థ ప్రెసిడెంట్ ఎస్.ప్రశాంత్ తెలిపారు. తనతో పాటు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అధ్యక్షుడు రాజేందర్ కూడా గిన్నిస్ అధికారులకు దరఖాస్తు చేయగా, ఈ మేరకు సమాచారం అందిందన్నారు.