కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం.. బంగారం చోరీ కేసు పత్రాలను నాశనం చేసే కుట్ర అంటున్న ప్రతిపక్షాలు
- జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ డిపార్ట్‌మెంట్‌లో ప్రమాదం
- ఫైళ్లను రక్షించేందుకు అధికారుల ఉరుకులు పరుగులు
- సచివాలయం ఎదుట బీజేపీ ధర్నా
కేరళ సచివాలయంలో నిన్న జరిగిన అగ్నిప్రమాదంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిని కావాలని చేసిన కుట్రగా అభివర్ణిస్తున్నాయి. సెక్రటేరియట్ రెండో అంతస్తులోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ డిపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటల బారినపడకుండా ఫైళ్లను రక్షించేందుకు పరుగులు పెట్టారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన ఫైళ్లు కాలిబూడిదయ్యాయి. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మరోపక్క, ఈ ప్రమాదంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. బంగారు ఆభరణాల చోరీ కేసుతో సంబంధం ఉన్న ఫైలును నాశనం చేసేందుకు ప్రభుత్వమే అగ్ని ప్రమాదం పేరుతో నాటకం ఆడిందని విమర్శిస్తున్నాయి. ప్రమాదంపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని జేడీయూ డిమాండ్ చేయగా, సచివాలయం ఎదుట బీజేపీ ధర్నాకు దిగింది. కాగా, బంగారం చోరీ కేసుకు సంబంధించిన అంశం ప్రస్తుతం ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయ పరిశీలనలో ఉంది.