రాంగోపాల్ వర్మ జీవిత చరిత్రతో మూడు భాగాలుగా తెరకెక్కనున్న చిత్రం... ఆసక్తికర విషయాలను వెల్లడించిన ఆర్జీవీ!
- మూడు చిత్రాలు కలిపి ఆరు గంటల నిడివి
- మూడో పార్ట్ లో స్వయంగా నటించనున్న వర్మ
- దొరసాయి తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న బయోపిక్
ఎందరో జీవితాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయోపిక్ కూడా రాబోతోంది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ చిత్రం మూడు భాగాలుగా ఉంటుందని... మూడు చిత్రాలు కలిపి 6 గంటల నిడివి ఉంటుందని వెల్లడించారు. బొమ్మాకు మురళి నిర్మాణంలో దొరసాయి తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలిపారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.
మూడు భాగాల్లో తన వేరువేరు వయసుల్లో వేరువేరు అంశాలను చూపెట్టబోతున్నట్టు వర్మ చెప్పారు. తొలి పార్ట్ లో తన 20 ఏళ్ల వయసప్పటి రోల్ లో కొత్త నటుడు నటిస్తాడని, రెండో భాగంలో మరో నటుడు నటిస్తాడని తెలిపారు. పార్ట్ 3లో తానే నటిస్తానని చెప్పారు.
తొలి పార్ట్ పేరు 'రాము' అని... ఈ సినిమాలో తన కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలై... 'శివ' సినిమా చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాననే విషయం ఉంటుందని వర్మ తెలిపారు. రెండో భాగం పేరు 'రామ్ గోపాల్ వర్మ' అని... ఇందులో అండర్ వరల్డ్ తో ప్రేమాయణం, తన ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్, అమితాబ్ బచ్చన్ తో అనుబంధాల గురించి ఉంటుందని చెప్పారు. మూడో పార్ట్ పేరు 'ఆర్జీవీ-ది ఇంటెలిజెంట్ ఇడియట్' అని... ఇందులో తన ఫెయిల్యూర్లు, వివాదాలు, దేవుళ్ల పట్ల, సెక్స్ పట్ల, సమాజం పట్ల తనకున్న విపరీత వైఖరుల గురించి ఉంటుందని తెలిపారు.