చైనా సరిహద్దులో ఉద్రిక్తత... ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మోహరించిన భారత్!

  • ఎల్ఏసీ వద్ద హెలికాప్టర్లను మోహరించిన చైనా
  • దీటుగా స్పందిస్తున్న భారత్
  • రాడార్లతో శత్రువుల కదలికలపై నిఘా
ఇండియా విషయంలో చైనా తన వంకర బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. వాస్తవాధీనరేఖ వద్ద ఇటీవలే తన బలగాలను వెనక్కి రప్పించుకున్న చైనా... మళ్లీ దూకుడును పెంచింది. వాస్తవాధీనరేఖ వద్ద హెలికాప్టర్లను మోహరించింది. ఈ  నేపథ్యంలో భారత్ కూడా దీటుగా వ్యవహరిస్తోంది. తూర్పు లడఖ్ ప్రాంతంలో అదనపు బలగాలను ఇండియన్ ఆర్మీ మోహరింపజేసింది. అంతేకాదు, రష్యన్ తయారీ ఇగ్లా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మోహరించింది.

దీనికి తోడు భుజాలపై పెట్టుకుని ఫైర్ చేసే ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ ను ఆ ప్రాంతంలోకి తరలించింది. మన గగనతలంలోకి చైనా హెలికాప్టర్లు వస్తే ఎదుర్కొనేందుకు సైన్యం వీటిని అక్కడ మోహరింపజేసింది. రాడార్ల సాయంతో సరిహద్దుల్లో భారత్ నిఘాను ముమ్మరం చేసింది. శత్రువుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.


More Telugu News