నీట్, జేఈఈ వాయిదా వేయాలంటూ కోరిన అంతర్జాతీయ ఉద్యమకారిణి గ్రేటా థన్ బెర్గ్
- నీట్, జేఈఈ నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధం
- వాయిదా వేయాలంటూ వినతులు
- తీవ్ర అనైతికం అంటూ థన్ బెర్గ్ వ్యాఖ్యలు
గ్రేటా థన్ బెర్గ్... స్వీడన్ దేశానికి చెందిన ఈ టీనేజ్ అమ్మాయి 17 ఏళ్లకే అంతర్జాతీయ స్థాయి పర్యావరణ ఉద్యమకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. అనేక ప్రపంచస్థాయి వేదికలపై తన గళం వినిపిస్తూ పర్యావరణాన్ని సంరక్షించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడీ అమ్మాయి భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలోనూ నీట్, జేఈఈ వంటి ప్రవేశపరీక్షలు నిర్వహించడంపై స్పందించింది. నీట్, జేఈఈలను వాయిదా వేయాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరింది.
"కరోనా రక్కసి ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలోనూ భారత్ లో విద్యార్థులకు జాతీయస్థాయి పరీక్షలు నిర్వహించడం తీవ్ర అనైతికం. దానికితోడు వరదల కారణంగా కోట్లాదిమంది నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. అందుకే నీట్, జేఈఈ వాయిదా వేయాలంటున్న వారికి నేను కూడా మద్దతు పలుకుతున్నాను" అంటూ గ్రేటా థన్ బెర్గ్ ట్వీట్ చేసింది.