ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన కె. రామచంద్రమూర్తి
- రాజీనామాను అజేయ కల్లంకు సమర్పించిన రామచంద్రమూర్తి
- వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా!
- గతంలో అనేక పత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించిన రామచంద్రమూర్తి
ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి ఏపీ ప్రభుత్వ సలహాదారు (ప్రజా విధానాలు) పదవికి రాజీనామా చేశారు. కె.రామచంద్రమూర్తి తన రాజీనామాను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లంకు సమర్పించారు. తన రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమని ఈ సందర్భంగా రామచంద్రమూర్తి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల పాత్రికేయుల్లో కె.రామచంద్రమూర్తి ఎంతో సీనియర్. అనేక దినపత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించారు. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సలహాదారులను నియమించగా, వారిలో కె.రామచంద్రమూర్తి కూడా ఉన్నారు.