తెలంగాణలో ఇంటి తలుపులన్నీ ఈ రెండు రంగుల్లోనే ఉన్నాయి... కారణమేంటి? యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆశ్చర్యం
- యూకే డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న ఫ్లెమింగ్
- ఇక్కడి సంస్కృతి పట్ల విస్మయం
- ఫ్లెమింగ్ కు బదులిచ్చిన ఓ నెటిజన్
హైదరాబాదులోని తెలుగు రాష్ట్రాల బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ను తెలంగాణలోని ఓ అంశం విపరీతంగా ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణలోని గ్రామాల్లో ఇంటి తలుపులు ప్రధానంగా రెండు రంగుల్లోనే ఉన్నాయని, గ్రీన్, బ్లూ కలర్ లోనే కనిపిస్తున్నాయని, ఇలా ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు.
దీనికి ఓ నెటిజన్ వెంటనే స్పందించాడు. ఇది తెలంగాణ ప్రజల వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం అని, తెలంగాణ సంస్కృతిలో ఇమిడిపోయిన అంశం అని తెలిపారు. మీరు ఎంతో నిష్కల్మషంగా, అమాయకంగా అడిగిన ఈ అంశాన్ని ఎవరైనా రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందని, పువ్వులను కూడా కొన్నింటికి ప్రతీకలుగా భావిస్తున్న రోజులని తెలిపారు. దీనికి ఆండ్రూ ఫ్లెమింగ్ బదులిస్తూ... ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని తనకు తెలుసని పేర్కొన్నారు. కానీ తనకు అలాంటి ఉద్దేశాలు లేవని భావిస్తున్నానని తెలిపారు.