కాజల్ అగర్వాల్ నిశ్చితార్థానికి సంబంధించి అసలు నిజం ఇది!

  • కాజల్ సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుందని వార్తలు
  • ఈ వార్తల్లో నిజం లేదన్న ఆమె ప్రతినిధి
  • ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం కెరీర్ పైనే అని వ్యాఖ్య
సినీనటి కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం జరిగిపోయిందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఔరంగాబాద్ కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ తో గుట్టుచప్పుడు కాకుండా ఈ కార్యక్రమం ముగిసిందనే వార్తలు వచ్చాయి. అయితే... ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని తేలిపోయింది. కాజల్ అగర్వాల్ ప్రతినిధి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు. ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పాడు. ప్రస్తుతం కాజల్ దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, సినిమాలతో ఆమె బిజీగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం ఆచార్య, మోసగాళ్లు, హే సినామిక, ప్యారిస్ ప్యారిస్, ముంబై సాగ చిత్రాల్లో కాజల్ నటిస్తోంది.


More Telugu News