భూమికి సమీపంగా వస్తున్న గ్రహశకలం... మనకేమీ ముప్పు లేదన్న నాసా!
- భూమికి అత్యంత సమీపానికి రానున్న చిన్నపాటి ఆస్టరాయిడ్
- భూ వాతావరణంలోకి వచ్చే చాన్సు 0.41 శాతం
- మనకేమీ ముప్పు లేదన్న నాసా
నవంబరు 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా సమాజం సహా యావత్ ప్రపంచం ఈ ఎన్నికలపై ఆసక్తిగా వుంది. అయితే, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ చిన్నపాటి గ్రహశకలం భూమికి సమీపానికి వస్తోందంటూ పేర్కొంది.
సరిగ్గా ఈ గ్రహశకలం అమెరికా ఎన్నికలకు ముందురోజు భూమండలానికి అత్యంత సమీపం నుంచి వెళుతుందని నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలాన్ని నాసా పరిశోధకులు రెండేళ్ల కిందటే గుర్తించారు. దీనికి 2018వీపీ1 అని నామకరణం కూడా చేశారు.
ఇక భూమికి 482 కిలోమీటర్ల సమీపానికి వచ్చే ఈ ఆస్టరాయిడ్ భూ వాతావరణంలోకి వచ్చే ఛాన్సు కేవలం 0.41 శాతం మేర మాత్రమే వుందని నాసా పేర్కొంది. ఒకవేళ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తే కనుక చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుందని, ఈ గ్రహశకలం ఎంతో నిదానంగా వస్తోందని, పైగా దీని సైజు 2 మీటర్లే కావడంతో భయపడాల్సిందేమీ లేదని నాసా అంటోంది.