దావూద్ ఇబ్రహీంకు సన్నిహితంగా ఉన్న పాకిస్థాన్ హీరోయిన్ ఈమే!
- 1993 పేలుళ్ల సూత్రధారి దావూద్
- మెహవిష్ హయత్ తో సన్నిహితంగా ఉన్న డాన్
- ఆమెకు ప్రతిష్ఠాత్మక అవార్డు కూడా
- దావూద్ తో పరిచయం తరువాత పాప్యులర్ అయిన మెహవిష్
భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, 1993 ముంబై వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం, పాక్ సినీనటితో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని తెలుస్తుండగా, ఇప్పుడు నెటిజన్లు, ఆమె ఎవరు? ఏ సినిమాల్లో నటించిందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు. పలువురు సినీ నటులతో సంబంధాలను కలిగున్న దావూద్, మెహవిష్ హయత్ అనే 37 ఏళ్ల నటితో మరింత దగ్గరగా మెలిగేవాడని పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం కరాచీలో అత్యంత లగ్జరీ ప్రాంతంలో పలాటియల్ బంగ్లాలో దావూద్ ఉన్నాడని తెలుస్తుండగా, గతంలో ముంబైలో ఉన్న సమయంలోనూ పలువురు బాలీవుడ్ నటీ నటులతో ఆయన సంబంధాలు నడిపాడన్న విషయం విదితమే. ఇండియాను వీడి వెళ్లిపోయినా, సినిమా పరిశ్రమతో మాత్రం సంబంధాలను వదల్లేక పోయాడు.
కాగా, 2009లో చిన్న పాత్రలు పోషించుకుంటూ పొట్ట పోసుకునే స్థితిలో ఉన్న మెహవిష్ హయత్ కు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన 'తమ్ గా ఏ ఇంతియాజ్' అవార్డును ప్రకటించడంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఆమెకు అవార్డు రావడం వెనుక దావూద్ ప్రమేయం ఉందని, ఆయన గట్టి సిఫార్సుతోనే హయాత్ కు అవార్డు వచ్చిందని తెలుస్తోంది. అప్పటివరకూ మీడియాకు గానీ, పాక్ సినీ ప్రియులకుగానీ పరిచయం లేని ఆమె పేరు, ముఖం, ఆపై ఎంతో పాప్యులర్ అయ్యాయి. ఆమెకు అంతటి అవార్డు రావడం నాడు దేశ సినీ పరిశ్రమను కూడా ఆశ్చర్యపరిచింది.
దాదాపు 10 సంవత్సరాల క్రితం ఎవరికీ పరిచితం కాని మెహవిష్ హయత్, అండర్ వరల్డ్ డాన్ కు సన్నిహితురాలిగా మారిన తరువాత, లైఫ్ స్టయిల్ నే మార్చేసుకుంది. పాక్ గ్లామర్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. ఇటీవల దావూద్ ను ఉగ్రవాదుల జాబితాలో పాక్ చేర్చడం, ఆపై ఒక్కరోజు వ్యవధిలోనే తాము ఆ పని చేయలేదని చెప్పడంతో మెహవిష్ పేరు కూడా మరోమారు తెరపైకి వచ్చింది.