ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ పోటీ.. నల్గొండ బరిలో కోదండరాం

  • పట్టభద్రుల కోటాలో రెండు స్థానాలకు ఎన్నికలు
  • కోదండరాం నేతృత్వంలో సమావేశమైన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ
  • దుబ్బాక ఉప ఎన్నికపై నివేదిక కోసం కమిటీ ఏర్పాటు
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగాలని ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జనసమితి (టీజేఎస్) నిర్ణయించింది. కోదండరాం నేతృత్వంలో నిన్న నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. వచ్చే ఏడాది పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ నుంచి కోదండరాం బరిలోకి దిగితే బాగుంటుందని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే, నిర్ణయం ఏదైనా సమష్టిగా తీసుకోవాలని కోరిన కోదండరాం.. మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. అలాగే, ఇతర పార్టీల నేతలు, సంఘాల నేతల అభిప్రాయాలు, మద్దతు సేకరించాలని కోరారు. అలాగే, దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో దానిపై నివేదిక తయారుచేసేందుకు కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు.


More Telugu News