చిన్నారులు, టీనేజర్లకు కరోనా ముప్పు అధికం: సీరం సర్వేలో వెల్లడి
- ఢిల్లీలో మొత్తం 15 వేల మందిపై సర్వే
- 5-17 ఏళ్ల మధ్య వయసు వారిలో 34.7 శాతం మందికి కరోనా ముప్పు
- ఢిల్లీలోని మొత్తం జనాభాలో 29.1 శాతం మందిలో యాంటీబాడీలు
కరోనా మహమ్మారిపై దేశ రాజధాని ఢిల్లీలో సీరం నిర్వహించిన సర్వేలో పలు ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. ఐదు నుంచి 17 ఏళ్ల వయసు మధ్య ఉన్న పిల్లలు, టీనేజర్లపై వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని సర్వేలో బయటపడింది. ఈ వయసు వారిలో 34.7 శాతం మంది ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 7వ తేదీ మధ్య మొత్తం 15 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు. వీరిలో 25 శాతం మంది 18 ఏళ్లలోపు వారు, 50 శాతం మంది 18 నుంచి 50 ఏళ్లలోపు వారు ఉన్నారు. మిగిలిన వారు 50 ఏళ్లు పైబడిన వారు.
సీరం సర్వే నివేదిక ప్రకారం.. ఢిల్లీలోని మొత్తం జనాభాలో 29.1 శాతం మందిలో వైరస్‌తో పోరాడే ప్రతిరోధకాలు అభివృద్ధి చెందాయి. 50 ఏళ్లు పైబడిన వారిలో 31.2 శాతం మంది కరోనా కోరల నుంచి బయటపడగా, 18-50 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 28.5 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు సర్వే వివరించింది.