సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
  • తమన్నా సినిమా ఆడియోకి మంచి రేటు 
  • వెబ్ సీరీస్ నిర్మాణంలోకి హీరో నాని
  • నిఖిల్ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్
*  తమన్నా, సత్యదేవ్ జంటగా 'గుర్తుందా శీతాకాలం' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. నాగశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే, ఆడియో హక్కులను ఆనంద్ ఆడియో సంస్థ 75 లక్షలకు సొంతం చేసుకుంది. కీరవాణి తనయుడు కాలభైరవ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
*  హీరో నాని వెబ్ సీరీస్ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా తనే వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్లానింగ్ జరుగుతోందని చెప్పాడు. కాగా, నాని నటించిన 'వి' చిత్రం వచ్చే నెల 5న అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ అవుతోంది.    
*  నిఖిల్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' చిత్రం రూపొందుతోంది. అల్లు అరవింద్, సుకుమార్ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ ను తీసుకున్నట్టు సమాచారం. గతంలో నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో ప్రియాంక నటించింది.


More Telugu News