మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భారీ భవంతి... శిథిలాల కింద 70 మంది!
- ఒక్కసారిగా కూలిన భవనం
- తప్పించుకోలేకపోయిన ప్రజలు
- భవన సముదాయంలో 45 ఫ్లాట్లు
మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో ఐదు అంతస్తుల భవంతి కుప్పకూలింది. ఈ ఘటనలో 70 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ భవన సముదాయంలో 45 ఫ్లాట్లు ఉన్నాయి. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు ముంబయి నుంచి మహద్ తరలివెళ్లాయి. అక్కడికి చేరుకున్న వెంటనే రక్షణ చర్యలకు ఉపక్రమించాయి. ప్రస్తుతానికి 15 మందిని కాపాడారు. భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఎవరూ తప్పించుకోలేకపోయారని స్థానికులు చెబుతున్నారు.