వర్చువల్ రియాలిటీ విధానంలో బాంబే ఐఐటీ స్నాతకోత్సవం 

  • ముగిసిన బాంబే ఐఐటీ 58వ స్నాతకోత్సవం
  • ముఖ్య అతిథిగా నోబెల్ విజేత డంకన్ హల్డేన్
  • వర్చువల్ ఆకారాలతో స్నాతకోత్సవం నిర్వహణ
కరోనా మహమ్మారి రాక అనేక సాంకేతిక విధానాల అమలుకు బాటలు వేసింది. తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాంబే ఐఐటీలో వర్చువల్ రియాలిటీ విధానంలో స్నాతకోత్సవం నిర్వహించారు. బాంబే ఐఐటీ 58వ స్నాతకోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నోబెల్ విజేత డంకన్ హల్డేన్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు.

అయితే, ఈ కార్యక్రమం కోసం వినూత్నరీతిలో విద్యార్థులు, ప్రొఫెసర్లు, ముఖ్య అతిథి, ఇతర అతిథులకు చెందిన డిజిటల్ రూపురేఖల్ని సృష్టించి, ఆ వర్చువల్ ఆకారాలతో తెరపై నిజంగానే స్నాతకోత్సవం జరుగుతోందన్న భావన కలుగుజేశారు. దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశారు. బాంబే ఐఐటీ 62 ఏళ్ల చరిత్రలో ఈ విధంగా పతకాలు ప్రదానం చేయడం ఇదే ప్రథమం. కాగా, ఈ ఏడాది ప్రెసిడెంట్ మెడల్ ను బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి సాహిల్ హిరాల్ షా గెలుచుకున్నాడు.



More Telugu News