మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు
- మచిలీపట్నంలో వైసీపీ నేత హత్య
- కొల్లు రవీంద్రపై ఆరోపణలు
- రాజమండ్రి జైల్లో ఉన్న కొల్లు
మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు బెయిల్ అభించింది. ఈ మేరకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. మోకా భాస్కరరావు హత్యకేసులో అరెస్ట్ అయిన కొల్లు రవీంద్ర ప్రస్తుతం రాజమండ్రి కారాగారంలో ఉన్నారు.