రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' సినిమా నిర్మాణాన్ని నిలిపివేయాలని నల్గొండ న్యాయస్థానం ఆదేశాలు

  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య
  • 'మర్డర్' చిత్రం ప్రకటించిన వర్మ
  • ప్రణయ్ హత్యకేసు విచారణ జరుగుతోందన్న కోర్టు
  • అప్పటివరకు 'మర్డర్' సినిమా నిలిపివేయాలని ఉత్తర్వులు
మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఘటనతో ప్రణయ్-అమృతల ప్రేమకథ ఓ విషాదాంతం అయింది. ఆ పాయింట్ ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' అనే సినిమా ప్లాన్ చేశారు. దీనిపై ప్రణయ్ భార్య అమృత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె దాఖలు చేసిన సివిల్ దావా పిటిషన్ పై విచారణ చేపట్టిన నల్గొండ న్యాయస్థానం రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు ప్రణయ్ హత్య కేసు విచారణ కొనసాగుతోందని, ఆ కేసు విచారణ పూర్తయ్యేవరకు 'మర్డర్' సినిమా చిత్రీకరణను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.


More Telugu News