ట్వీట్ ను ఉపసంహరించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్
- సీడబ్ల్యూసీ సమావేశంలో రచ్చ
- సీనియర్లపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు
- అసహనం వ్యక్తం చేసిన సిబాల్, ఆజాద్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్లపై సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వీరంతా బీజేపీతో కుమ్మక్కయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు.
మమ్మల్ని బీజేపీతో కుమ్మక్కయ్యామంటారా? అంటూ సిబాల్ ట్వీట్ చేశారు. రాజస్థాన్ హైకోర్టులో వాదించి ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఎవరని ప్రశ్నించారు. మణిపూర్ లో బీజేపీని దించి కాంగ్రెస్ ను కాపాడింది ఎవరని అడిగారు. గత 30 ఏళ్ల కాలంలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటన అయినా చేయడం చూశారా? అని అసహనం వ్యక్తం చేశారు.
దీని తర్వాత కపిల్ సిబాల్ యూటర్న్ తీసుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తనకు వ్యక్తిగతంగా చెప్పారని... అందుకే తాను చేసిన ట్వీట్ ను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు.