మూగజీవాలపై రఘురామ ప్రేమ!

  • మూగజీవాలకు ఆహారం అందించిన నరసాపురం ఎంపీ
  • ఆవుదూడలకు, శునకాలకు ఆహారం తినిపించిన వైనం
  • వ్యవసాయక్షేత్రంలో సందడి చేసిన రఘురామకృష్ణరాజు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగుతున్న ఆయన, ఆ పార్టీ అధినాయకత్వంపై ఏదో ఒక అంశం ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇటీవలే ఆయనకు కేంద్రం సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించింది. ఈ నేపథ్యంలో రఘురామ ఏంచేసినా మీడియా, సోషల్ మీడియా ఫోకస్ అటే ఉంటోంది.

భద్రతా బలగాలతో కలిసి కెమెరా ముందు నిల్చున్నా అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా, ఆయన వ్యవసాయక్షేత్రంలో మూగజీవాలకు ఆహారం తినిపిస్తున్న ఫొటోలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆవు దూడలకు, కొన్ని శునకాలకు ఆయన ఎంతో ప్రేమగా ఆహారం అందించడం ఆ ఫొటోల్లో చూడొచ్చు.


More Telugu News