కాంగ్రెస్ సీడబ్ల్యూసీలో వాడీవేడీ చర్చ... సొంత పార్టీ నేతలపై మండిపడ్డ రాహుల్ గాంధీ
- 23 మంది సీనియర్లు రాసిన లేఖపై రాహుల్ అసంతృప్తి
- సోనియా అనారోగ్యంతో ఉన్నప్పుడు లేఖ ఎందుకని ప్రశ్న
- పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానన్న సోనియా
- వద్దని చెప్పిన మన్మోహన్ సింగ్
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చర్చలు జరిపేందుకు ఆ పార్టీ సీడబ్ల్యూసీ కీలక భేటీ కొనసాగుతోంది. 23 మంది సీనియర్లు రాసిన లేఖను ఆ పార్టీ నేత వేణుగోపాల్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సోనియా అనారోగ్యంతో ఉన్నప్పుడు పార్టీ నేతలు లేఖ ఎందుకు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో లేఖ రాయడం సరికాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
కాగా, ఈ భేటీలో మొత్తం 48మంది నేతలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఈ సమావేశంలో సోనియా గాంధీ కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని ఆమె సూచించినట్లు సమాచారం. అయితే, అందుకు కొందరు నేతలు నిరాకరించారు.
పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు పలువురు కోరారు. గాంధీ కుటుంబం చేతిలోనే అధ్యక్ష పగ్గాలు ఉండాలని కొందరు వాదిస్తున్నారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కొందరు నేతలు అంటున్నారు. ఈ సమావేశంలో వాడీవేడీగా చర్చ కొనసాగుతోంది.